దీపావళి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు..యూపీ సీఎం యోగీ బంపరాఫర్ 

దీపావళి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు..యూపీ సీఎం యోగీ బంపరాఫర్ 
  • 1.89 కోట్ల మందికి లబ్ది
  • సబ్సిడీ కింద రూ.1,500 కోట్లు కేటాయింపు

లక్నో: యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన కింద అర్హత కలిగిన పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా ఉచితంగా ఒక్కో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1.89 కోట్లకు పైగా పేదలకు ఈ ప్రకటనతో లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద సబ్సిడీల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించింది. 'ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.983.45. కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.335 సబ్సిడీ అందిస్తుంది.

లబ్ధిదారులు రూ.648.55 చెల్లించాల్సి ఉంటుంది. కానీ పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. మీరు ఆదా చేసే డబ్బుతో దీపావళి మిఠాయిలు, ప్రమిదలు కొనుగోలు చేసుకోవచ్చు' అని సీఎం యోగీ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ కనెక్షన్ల కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని, ప్రస్తుత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని, ఇదే అసలైన సుపరిపాలన అని కొనియాడారు. నవంబర్ 7న జరగనున్న అయోధ్య దీపోత్సవం సామాజిక ఐక్యతకు ప్రతీక అని అభివర్ణించారు. కుల, మత భేదాలను పక్కనపెట్టి ప్రజలంతా సాంస్కృతిక భాగస్వామ్యంతో ఏకమయ్యేలా ఈ వేడుక దోహదపడుతుందని పేర్కొన్నారు.